‘ప్రైవేటు’టీచర్లలోనే క్వాలిటీ ఉందంటే రాజీనామా
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సవాల్
హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లలో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ టీచర్లలో ఉందని నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టిఎస్‌యుటిఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సమస్యలపైన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానం బలంగానే ఉంద న్నారు. ప్రైవేట్ సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నారాయణ, టీఎస్‌యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ నాయకులు చావా రవి, సాంబశివ, హైమావతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.