కాశినాయన : మండలంలోని ఓబుళాపురం సమీపంలోని సగిలేరు ఒడ్డున ఉన్న వివేకానంద సేవాశ్రమంలో ఆదివారం ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, రామతులసిలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ హాజరై పలు రకాల మొక్కలు నాటారు. ఎస్‌ఐ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. డాక్టర్ పీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment