
తుళ్లూరురూరల్(తాడికొండ): ఏపీ రాజధాని అమరావతి ప్రతిపాదిత నేలపాడు గ్రామంలో నిర్మించనున్న శాశ్వత హైకోర్టు భవనానికి శంకుస్థాపన తేదీ ఖరారైంది. గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ బుధవారం పర్యటించారు. ఫిబ్రవరి మూడో తేదీన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవం నాడే ..శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
తొలుత శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే ప్రదేశాన్ని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ శశిధర్, రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణ నుంచి పలువురు న్యాయమూర్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment