thulluru
-
Live: తుళ్లూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
లోకేష్ గోబ్యాక్
-
కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారు
-
టీడీపీ అరాచకం.. కారుతో తొక్కించి...
తుళ్లూరు (తాడికొండ) : రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో టీడీపీ వర్గీయులు రాక్షసంగా ప్రవర్తించారు. నెక్కల్లు గ్రామంలో నడకదారి విషయమై ఏర్పడిన వివాదంలో న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళుతున్న బీసీలను కారుతో తొక్కించేశారు. ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతిచెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో పసుపులేటి భూపతిరావు, ఆలూరి బ్రహ్మయ్య ఇళ్ల మధ్య నడిచే దారి విషయంలో వివాదం చెలరేగింది. బీసీలైన భూపతిరావు, అక్కడున్న మహిళలను టీడీపీకి చెందిన ఆలూరి బ్రహ్మయ్య దుర్భాషలాడి మహిళలపై దాడి చేశారు. బాధితులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. రోడ్డుపక్కనున్న వారిపైకి కారు నడిపి.. పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డు మీద ఆటోకోసం ఎదురుచూస్తున్న వారి మీదుగా ఆలూరు బ్రహ్మయ్య కొడుకు ఆలూరు సుధాకర్‌బాబు కారు నడిపి తొక్కించేశాడు. ఆ సమయంలో కారులో బ్రహ్మయ్య, అతడి మరో కుమారుడు ఆలూరి అజయ్, వారి బంధువు యర్రమాసు శ్రీనివాసరావు ఉన్నారు. కారు కింద నలిగి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో పసుపులేటి మహాలక్ష్మి (65) మృతి చెందింది. వీరమ్మ, పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య, వెంకటలక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తొలుత పరారైన నిందితులు తరువాత పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. -
3న ఏపీ శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన
తుళ్లూరురూరల్(తాడికొండ): ఏపీ రాజధాని అమరావతి ప్రతిపాదిత నేలపాడు గ్రామంలో నిర్మించనున్న శాశ్వత హైకోర్టు భవనానికి శంకుస్థాపన తేదీ ఖరారైంది. గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ బుధవారం పర్యటించారు. ఫిబ్రవరి మూడో తేదీన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవం నాడే ..శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తొలుత శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే ప్రదేశాన్ని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ శశిధర్, రూరల్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబుతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణ నుంచి పలువురు న్యాయమూర్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
సీఆర్డీఏ చెప్పిందే తప్ప నేను చెప్పేది వినలేదు
-
రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం
-
తుళ్లూరులో చంద్రబాబును నిలదీసిన రైతు
-
'ఏయ్ పెద్ద పెద్దగా మాట్లాడొద్దు..'
సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ రైతు చంద్రబాబుపై నిండు సభలో విమర్శలు గుప్పించాడు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన రైతులు తమ బాధలను చంద్రబాబుతో చెప్పుకొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సభలో తనపై జరిగిన దాడిని ఓరైతు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశాడు. సుబ్బయ్య అనే రైతు తనపై దాడిచేశాడని, ఈవిషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామాంజనేయులు అనే రైతు చంద్రబాబుకు వివరించాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో ఉన్న రామాంజనేయులు అమరావతిలో ప్రజలకు రక్షణ లేదన్నాడు. ఈ మాటలు సీఎంకు ఆగ్రహం తెప్పించాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దంటూ ముఖ్యమంత్రి రామాంజనేయులుకు వార్నింగ్ ఇచ్చారు. అయినా దేశానికి అన్నం పెట్టే రైతు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనే స్వాతంత్ర్యం కూడా లేదా అంటూ పలువురు రైతులు చర్చించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి రైతులంటే మొదటి నుంచి చిన్నచూపే. అందుకే పూర్తి రుణమాఫి చేస్తామని అన్నదాత నెత్తిన శఠగోపం పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కల్తీ విత్తనాల దెబ్బకు కుదేలై పంటకు ఉపయోగించాల్సిన పురుగుల మందుతో ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ఆవేదన సైతం వినే ఓపిక కూడ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. -
వైద్యశాల సరే... సీఆర్డీఏ కార్యాలయం ఎక్కడ?
► 30 పడకల ఆస్పత్రి నిర్మాణంతో సందిగ్ధత ► కార్యాలయ నిర్వహణ కష్టమంటున్న అధికారులు తుళ్ళూరు: తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తాత్కాలిక సీఆర్డీఏ కార్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాజధానిలో పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తుళ్లూరు పీహెచ్సీ ఆవరణలో 30 పడకల వైద్యశాల నిర్మాణం చేపట్టింది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ఈ పరిసరాలలో సీఆర్డీఏ కార్యాలయం నిర్వాహణ కష్టతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయం గుంటూరుకో లేదా, విజయవాడకో మారుస్తారని ప్రచారం జరిగింది. మరి కొంతకాలం మందడంలో శాశ్వత భవనం ఏర్పాటు చేస్తారని, లింగాయపాలెం వద్ద తుళ్ళూరు సీఆర్డీఏ శాశ్వత కార్యాలయం వుంటుందని రాజధాని గ్రామాలలో ప్రచారం జరిగింది. అయితే అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో సీఆర్డీఏ కార్యాలయం ఈ ప్రాంతంలో వుంటుందా?లేదా? అని రాజధాని గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలాగే నాణ్యతా ప్రమాణాలతో వైద్యశాలను నిర్మించాలని తుళ్ళూరు ప్రజలు కోరుతున్నారు. -
తుళ్లూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు
తుళ్లూరు : నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఆయా దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని గుంటూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు హెచ్చరించారు. బుధవారం ఆయన 15 మంది బృందంతో తుళ్ళూరులోని పాన్ షాపులు, బేకరీలు, టీ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఎక్కువ మోతాదులో రంగులు వినియోగించి తయారు చేసిన కేక్‌లు, టీ పౌడర్, స్వీట్లను ఆయన డ్రై నేజీ కందకంలో పారబోయించారు. పాన్ షాపుల్లో పలుచోట్ల లభ్యమైన నిషేధిత పాన్‌పరాగ్, గుట్కా ప్యాకెట్లను నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ మొదటిసారిగా తుళ్లూరులో ఈ దాడులు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతం కావడంతో ఇకపై తరచూ ఈ తరహా దాడులు ఉంటాయని తెలిపారు. దుకాణాల్లో హానికరమైన, నాణ్యతలేని ఆహార పదార్థాలు తయారుచేసినా, విక్రయించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలిసారి కావడంతో హెచ్చరించి వదిలేస్తున్నామని, మరోసారి నిషేధిత ఆహార పదార్థాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు క్రిమిన ల్ కేసులు పెడతామని హెచ్చరించారు. -
హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేలపాడు రైతులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని డిమాండ్ అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పొలాల్లో రాళ్లుపాతి కాగితాలపై ప్లాట్లు ఇస్తే మాకు ఉపయోగం ఏమిటని నేలపాడు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో దొండపాడు గ్రామానికి చెందిన రైతులు చాలాకాలం నుంచి ఈనాం భూముల ప్యాకేజీ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, అది తేల్చకుండా హడావిడిగా ప్లాట్లు పంపిణీ చేయవద్దని అంటున్నారు. తుళ్ళూరు: తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద జూన్ 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేలపాడు రైతులకు 1,418 ఎకరాలకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. లాటరీ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా 824 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఎంపిక చేసిన రైతులకు 1,147 రెసిడెన్సియల్ ప్లాట్లను సీఎం లాటరీ ద్వారా పంపిణీ చేయగా, మంత్రులు పత్తిపాటిపుల్లారావు, నారాయణ 769 కమర్షియల్ ప్లాట్లకు లాటరీ తీశారు. ఇదే క్రమంలో మరో 55 మంది రైతులకు విల్లాలు కూడా లాటరీ ద్వారా తీసి పంపిణీ చేశారు. అయితే ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ఐదు రకాలుగా అభివృద్ధి చేసి ప్రభుత్వం ప్లాట్లు ఇస్తుందని చెప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం పొలాల్లో రాళ్లు మాత్రమే వేసిందని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పేపర్లపై ప్లాట్లు ఇవ్వడం వల్ల రైతులను ఒరిగిందేమీ లేదని అంటున్నారు. భూములు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేశారని, భూములకు ధరలు వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదని రైతులు అంటున్నారు. తమ ప్లాట్లకు ధర రావాలంటే ముందుగా ప్రభుత్వం చెప్పినట్టు రహదారులు, తాగునీరు, విద్యుత్, గ్యాస్, డ్రెయినేజీ వంటి పనులు నిర్వహించాలని ఈసందర్భంగా రైతులు కోరుతున్నారు. ఇదేక్రమంలో రైతులకు ప్లాట్లు రిజిస్టర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్లపై కాకుండా క్షేత్రస్థాయిలో ప్లాట్ల పంపిణీ జరగాలని, ఈమేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు వేగవంతం చేయాలని నేలపాడు రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా దొండపాడులో కూడా ప్లాట్లు పంపిణీ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 271.70 ఎకరాలు భూమి ఉండగా 260 మంది రైతులు 265.66 ఎకరాలకు 9.3 అనుమతి పత్రాలు అందజేశారు. వీరిలో 194 మంది రైతులకు 234.31 ఎకరాలకు 9.14 ఒప్పందపత్రాలు అందజేశారు. రైతులు మాత్రం ఈనాం భూములు వ్యవహారం, దాని ప్యాకేజీపై అధికారులు స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే అందరికీ ప్లాట్లు పంపిణీ చేయాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారులు నడుచుకోవాలని దొండపాడు రైతులు కోరుతున్నారు. -
తుళ్లూరులో వైఎస్సార్సీపీ ఆందోళన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని వెంటనే భూసేకరణను నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. మరోవైపు భూసేకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాసంఘాలు, రైతుసంఘాలు, అఖిలపక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని కోసమని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూదందాపై నిరసనలు చేపట్టేందుకు అఖిలపక్షాలు కార్యాచరణ రూపొందించాయి. భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, 24న నిడమర్రులోని సీఆర్డీఏ కార్యాలయం ముట్టడి, అదే రోజు సాయంత్రం అక్కడ బహిరంగసభ ఉంటాయి. ఆగస్టు 25న నిడమర్రు, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మండలాల్లో సీఆర్డీఏ కింద భూములు సేకరించే గ్రామాల్లో బంద్ పాటించనున్నారు. అలాగే 26న విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేపట్టే దీక్షల్లో పాల్గొంటారు. ఈ మేరకు వివిధ పక్షాలతో చర్చించి, ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నేతలు ప్రకటించారు. -
తూళ్లూరులో పవన్ పర్యటన!
-
తూళ్లూరులో టెన్షన్..!