నూతన సమాజం కోసం స్వేరోస్ కృషి చేయాలి
కోరికలు అదుపులో ఉంచుకున్నప్పుడే అభివృద్ధి
గిరిజన శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
ములుగు : రాజ్యాంగ నిర్మాతగా కొనియాడుతూ అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసే వారే త మ ఇళ్లకు చేరుకున్నాక అంబేద్కర్‌ను అంటరా ని వారిగా భావించడం సిగ్గుచేటని స్వేరోస్ చైర్మన్, సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలకేంద్రంలోని డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో స్వేరోస్ ఆధ్వర్యం లో బుధవా రం నిర్వహించిన భీందీక్ష సభకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరాజిత జాతులకు లక్ష్యాన్ని సాధించుకోవాలని గొప్ప సక ల్పం ఉంటుందని, అయితే దానిని ఆచరణ లో పెట్టినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమని అ న్నారు. చేసే పనిలో మనసును లగ్నం చేసుకొ ని ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఇంట్లో దేవుని గదితో పాటు పుస్తకాల గదిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమ లక్షణమని తెలిపారు. కో రికలను అదుపులో ఉంచుకున్నప్పుడే భవిష్యత్తులో ఎదుగుతామన్నారు. నేటి యువత ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
చరిత్రను విస్మరించే జాతి సమాజంలో అనగదొక్కబడుతుంది..
ముఖ్యంగా నేటి సమాజం మూడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవాలని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏ జాతులైతే తమ చరిత్రను విస్మరిస్తాయో ఆ జాతులు సమాజంలో అనగదొక్కబడుతాయన్నారు. ఏ జాతులైతే రాబోయే ప్రమాదాలను ఎదుర్కోవడంలో విఫలమవుతాయో ఆ జాతులు ప్రమాదం బారిన పడి అణగారిన వర్గాలుగా మిగిలిపోతాయన్నారు. ఏ జాతులైతే బలహీనతను అధిమించవోప్రపంచ ం చేతిలో బానిసత్వాలుగా మిగిలిపోతాయని అన్నారు. నూతన సమాజం కోసం స్వేరోస్ పాటు పడాలని సూచించారు. అనంతరం స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రవీణ్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి, డివిజన్ అధ్యక్షుడు బొట్ల కార్తీక్ , జాతీయ కమిటీ నాయకులు ఆరూరి సుధాకర్, డాక్టర్ రామకృష్ణ, స్వేరోస్ రాష్ట్ర నాయకులు పట్టాబి రవికుమార్, జిల్లా అధ్యక్షుడు పుల్ల కిషన్, డివిజన్ గౌవర అధ్యక్షుడు గుగిళ్ల సాగర్, తదితరులు పాల్గొన్నారు.
2035నాటికి 47శాతం ఉద్యోగాలు కంప్యూటర్లే చేస్తాయి..
2035వ సంవత్సరం నాటికి 47శాతం ఉద్యోగాలను కంప్యూటర్లే చేస్తాయని, రాబోయే కాలం లో మనిషి చేసే ప్రతి పనిని రోబోలే చేస్తాయనడ ంలో సందేహం లేదని అన్నారు. మిషన్ లర్నింగ్, అర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ సంబంధించి ప్రత్యేక రోబోల తయారీకి దేశాలు పోటీ పడుతున్నాయని అన్నారు. మనిషి లాగా ఆలోచించే మరమనుషులు ఫ్యాక్టరీలలో తయారవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో మనుషులతో కాకుండా మిషన్‌లతో పోరాడే సమయం వస్తుందని జోస్యం చెప్పారు.