సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి రూరల్: బహుజన భరోసా పేరుతో బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మంగళవారం హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ నాయకుల సమ క్షంలో పది ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టో ను ప్రకటించారు. 3.91 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బహుజన భరోసా ఆవిష్కరిస్తున్న ట్లు ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలైందని, ఈ రాష్ట్రాన్ని అందరి తెలంగాణగా మార్చేందుకే బహుజన భరోసా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా మేనిఫెస్టోల పేరుతో మరో సారి అంకెల గారడీ చేసిందని విమర్శించారు. గ్రూ ప్ పరీక్షలు రాసి ఉద్యోగం రాదని తెలిసి ఆత్మ హత్యకు పాల్పడ్డ యువతి ప్రవల్లిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు మాటలు మాట్లాడారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ తెలంగా ణ ఎలా ఉండాలని మేధావులు, రిటైర్డ్ అధికారు లు, అన్నివర్గాల ప్రజలతో చర్చించి బహుజన భరో సా పేరుతో మేనిఫెస్టో రూపొందించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇది ప్రొవిజనల్ మేనిఫెస్టో మాత్రమే నని, తెలంగాణ ప్రజలు ఇంకా ఏమైనా కోరుకుంటే వారి ఆకాంక్షల మేరకు వాటిని కూడా పొందుపరు స్తామని చెప్పారు.
కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ని బీఎస్పీ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ మావోయిస్టు నిదానపురం కొమురయ్య బీఎస్పీలో చేరారు. ఆయనకు ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ నేత మర్రిపల్లి సతీశ్ బీఎస్పీలో చేరారు.
మేనిఫెస్టోలో బీఎస్పీ ఇచ్చిన 10 ప్రధాన హామీలు..
1. ‘కాన్షీ’ యువ సర్కార్: యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. మహిళలకు 5 లక్షల ఉద్యో గాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయ కులు.
2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, డేటా, ఏఐ, కోడింగ్ లో శిక్షణ.
3. బహుజన రైతు ధీమా: ప్రతి పంట కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు.
4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, మహిళా రైతులకు ఉచిత వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్‌లో శిక్షణ. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష
5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.
6. బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా
7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్
8. వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ. 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి, కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.
9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం. ఇంటి పునర్నిర్మా ణానికి రూ.1 లక్ష సహాయం.
10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.
Comments
Please login to add a commentAdd a comment