గజరాజులకు భుజబలమే కాదు. బుద్ధి బలమూ ఎక్కువే అని మరోసారి నిరూపితమైంది. అనాలోచితంగా, అడ్డదిడ్డంగా కాకుండా.. ఓ ఏనుగు స్మార్ట్‌గా ఆలోచించి గమ్యాన్ని చేరింది. మనుషులకు కూడా కష్టమనిపించే పాడుబడ్డ చిన్న మెట్ల మార్గం గుండా పైకి చేరింది. ఎలాంటి అదురూ బెదురూ లేకుండా.. పైకి చేరిన ఏనుగు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంది. ఇక జంతువులకు సంబంధించి విశేషాలను సోషల్ పంచుకునే ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేయగా వైరల్ అయింది.