అనంతపురం నుంచి బెంగళూరువైపు వెళుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్ కాపలా లేని గేటువద్ద ఆగివున్న లారీని ఢీకొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున 3.30 గంటలకు హిందూపురం సమీపంలోని దేవరపల్లి సమీపంలో జరిగింది. ఫలితంగా బెంగుళూరు వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. దేవరపల్లి వద్ద కాలపాలేని రైల్వే గేటు ఉంది. బెంగుళూరు నుంచి హిందూపురం పారిశ్రామిక వాడకు తుక్కు ఇనుము లోడుతో వెళుతున్న ఒక లారీ సాంకేతిక లోపంతో రైలు పట్టాలపై ఆగిపోయింది.