
జోగిపేట: భవిష్యత్తులో గురుకుల వర్సిటీ లు ఏర్పాటయ్యే ఆలోచనలో ప్రభుత్వం ఉందని గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అందోలు గురుకుల బాలికల పాఠ శాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ.. గురుకుల పాఠశాలల్లో కొత్తగా లలితకళల కోర్సులను కూడా ప్రారంభించనున్నామని, ఎవరైనా సినిమా రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు.