ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వ్యాప్తిస్తున్నాయి. ఆయన ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారన్న వార్తలకు ప్రాధాన్యత చేకూరుతోంది.
‘నేను సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్నా. రానున్న ఎన్నికల్లో అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తాను. ఆమె హృదయం పేద ప్రజలకు కోసం తపిస్తూ ఉంటుంది’అని డానిష్ అలీ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్(NAC).. ఎంఎన్‌ఆర్‌ఈజీ, ఆర్టీఐ, విద్యా హక్కు, ఆహార భద్రతా బిల్లు వంటి పేదల, పారదర్శక చట్టాలను ప్రయోగాత్మకంగా రూపొందించిందని డానిష్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సంప్రదింపుల్లో అమ్రోహా సెగ్మెంట్ గురించి చర్చలు జరిపింది.
Honoured to get blessings of epitome of sacrifice, Smt #SoniaGandhi for my 2nd #LokSabhaElection from #Amroha. Her heart beats for India’s poor. It was NAC headed by her that piloted landmark pro-poor & transparency laws like MNREGA, #RTI, Right to Education, Food Security Bill. pic.twitter.com/AAesBjF2FH
— Kunwar Danish Ali (@KDanishAli) March 14, 2024
అయితే రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు.
‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’బీఎస్పీ గతేడాది వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment