కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన భార్యను వదిలి వెళ్లిన బీఎస్‌పీ ఎంపీ అభ్యర్థి
బాలాఘాట్: అనుభా ముంజారే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈమె భర్త కంకర్ ముంజారే గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా బాలాఘాట్ లోక్‌సభ స్థానానికి బీఎస్‌పీ అభ్యరి్థ. తామిద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నందున ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నానంటూ కంకర్ ముంజారే ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ‘భిన్న సిద్ధాంతాలు కలిగిన పారీ్టల్లో కొనసాగుతూ ఇద్దరం ఒకే చోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ మమ్మల్ని అనుమానిస్తారు. అందుకే శుక్రవారం నుంచి వేరే చోట ఓ గుడిసెలో ఉంటున్నాను.
ఎన్నికల పోలింగ్ రోజున ఏప్రిల్ 19వ తేదీన తిరిగి మా ఇంటికి వెళ్తా’అని ఆయన తెలిపారు. భర్త నిర్ణయం తనను బాధిస్తోందని అనుభ చెప్పారు. ‘గతంలో ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పారస్‌వాడ స్థానానికి, నేను బాలాఘాట్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం. పెళ్లైనప్పటి నుంచి 33 ఏళ్లుగా కుమారుడితోపాటు కలిసే సంతోషంగా ఉంటున్నాం’అని ఆమె అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భర్త కంకర్‌పై విమర్శలు చేయబోనన్నారు. కాగా, 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్‌లో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్‌పై అనుభా ముంజారే ఘన విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment