
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లాలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. అదాలత్ జంక్షన్ అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పలువురు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కాగా, తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణమని బాధితుడు ఓ లేఖలో పేర్కొన్నాడు. (చదవండి : తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా)
Comments
Please login to add a commentAdd a comment