సాక్షి, వరంగల్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నారు.
రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.
చదవండి: జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆరోజే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అధికార కార్యక్రమాలతోపాటు, బహిరంగ సభకు కాషాయ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర నాయకత్వ మార్పు, బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి, కిషన్ రెడ్డికి తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ సూసైడ్ అటెంప్ట్
Comments
Please login to add a commentAdd a comment