నారా లోకేశ్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? | Nara lokesh assets amount to about Rs 217 crores | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Published Wed, Mar 8 2017 1:37 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

నారా లోకేశ్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? - Sakshi

నారా లోకేశ్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విజయవాడ : టీడీపీ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన నారా లోకేశ్‌  తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన పేరు మీద హెరిటేజ్‌ షేర్లు, ఇతర ఆస్తుల విలువ రూ.217కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన స్థిరాస్తుల విలువ రూ.9.95 కోట్లుగా వెల్లడించిన లోకేశ్‌...తన భార్య బ్రాహ్మణి పేరు మీద షేర్ల విలువ రూ.17.90 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆమె  స్థిరాస్తుల విలువ రూ.4.45 కోట్లు, కుమారుడు దేవాన్ష్‌ పేరు మీద షేర్ల విలువ రూ.2.70 కోట్లు, అతడి స్థిరాస్తులు రూ.9.60 కోట్లు ఉన్నట్లు లోకేశ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కాగా ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 6వ తేదీన నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి నారా లోకేశ్‌, కరణం బలరాం, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్  ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement