లోకేష్‌కు లైన్ క్లియర్.. త్వరలో ఎమ్మెల్సీ పదవి | Tdp Politbureau discussed about mlc electons | Sakshi
Sakshi News home page

లోకేష్‌కు లైన్ క్లియర్.. త్వరలో ఎమ్మెల్సీ పదవి

Published Sun, Feb 26 2017 2:07 PM | Last Updated on Mon, Sep 17 2018 5:43 PM

లోకేష్‌కు లైన్ క్లియర్.. త్వరలో ఎమ్మెల్సీ పదవి - Sakshi

లోకేష్‌కు లైన్ క్లియర్.. త్వరలో ఎమ్మెల్సీ పదవి

అమరావతి: ఎంతోకాలంగా లోకేష్ను కేబినేట్లో చేర్చుకోవాలనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సమయం కోసం ఎదురుచూస్తున్న లోకేష్.. ఇందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు.  ఎమ్మెల్యే కోటాలో లోకేష్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆదివారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో వ్యూహాత్మకంగా లోకేష్ పేరును తెరమీదకు తెచ్చినట్టు  తెలిసింది. లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కొందరు నేతల ద్వారా ప్రతిపాదన చేయించినట్టు తెలిసింది. లోకేష్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత కేబినేట్లోకి తీసుకోవాలా లేక ముందుగానే చేర్చుకోవాలా? అన్న విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని పొలిట్ బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక నిర్ణయాన్ని పొలిట్ బ్యూరో.. సీఎం చంద్రబాబుకు అప్పగించింది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేయాలని సూచించింది. ఇకపోతే పొలిట్ బ్యూరో సమవేశంలో తెలంగాణ, ఏపీ అసెంబ్లీ లో అనుసరించాల్సిన వైఖరిపైన, పార్లమెంట్ సమావేశాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల తీరుపై  చర్చ జరిగింది.  అమెరికాలో తెలుగు వారిపై కాల్పుల పై ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత నందమూరి హరికృష్ణ పొలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. మార్చి 2వ తేదీన 11.25 గంటలకు చంద్రబాబు అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement