సర్పంచ్‌గా పనిచేయాలన్నా చేస్తా: లోకేష్‌ | nara lokesh thanks to tdp | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌గా పనిచేయాలన్నా చేస్తా: లోకేష్‌

Published Mon, Mar 6 2017 2:21 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

సర్పంచ్‌గా పనిచేయాలన్నా చేస్తా: లోకేష్‌ - Sakshi

సర్పంచ్‌గా పనిచేయాలన్నా చేస్తా: లోకేష్‌

అమరావతి: ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పార్టీకి కృజ్ఞతలు చెప్పారు. సోమవారం ఆయన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

పార్టీ నేతలతో కలసి లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకొకరిని రాజీనామా చేయించి పోటీ చేయాలనుకోవడం లేదని అన్నారు. తాను పోటీ చేయాలా లేదా అన్నది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయమని చెప్పారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చామని, ఐదేళ్లలో అమలు చేస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, ఇంకా రెండేళ్లు మిగిలి ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనను సర్పంచ్‌గా ఉండమని టీడీపీ అధ్యక్షుడు చెబితే అదే చేస్తానని నారా లోకేష్‌ అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement