అభిమానులే గెలిపించాలి | Alia Bhatt Nominated For Most Inspiring Asian Woman At People Choice Awards 2019 | Sakshi
Sakshi News home page

అభిమానులే గెలిపించాలి

Published Sun, Sep 8 2019 12:15 AM | Last Updated on Sun, Sep 8 2019 12:15 AM

Alia Bhatt Nominated For Most Inspiring Asian Woman At People Choice Awards 2019 - Sakshi

ఆలియా భట్‌

కెరీర్‌లో ఫుల్‌ ఫామ్‌తో దూసుకెళ్తున్నారు ఆలియా భట్‌. అవకాశాలు ఆమెకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆలియాకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. కానీ ఇందులో గెలవడం ఆలియా చేతిలో లేదు. ఆమె అభిమానులే గెలిపించాలి. ‘మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ ఆసియన్‌ ఉమెన్‌ పీపుల్‌ ఛాయిస్‌ అవార్డు’ కు అలియా భట్‌ నామినేట్‌ అయ్యారు. ఈ ఏడాది ఇండియా నుంచి నామినేట్‌ అయ్యింది ఆలియా భట్‌ ఒక్కరే కావడం విశేషం.

ఇక ఆలియాను గెలిపించాలంటే ఆమె అభిమానులు ఆన్‌లైన్‌ పోల్‌ ఓట్లు వేయాలి. ఈ అవకాశం అక్టోబరు 18 వరకు ఉంటుంది. నవంబరు 10న విజేతను ప్రకటిస్తారు. చైనీస్‌ యాక్టర్‌ జౌ డోంగ్యూ, సౌత్‌ కొరియన్‌ నటి జంగ్‌ యు మీ, థాయ్‌ నటి ప్రయా లండ్‌బర్గ్‌ వంటి వారు ఆలియా భట్‌కు పోటీగా ఉన్నారు. ఇంతకుముందు ఈ అవార్డును ప్రియాంకా చోప్రా గెలుచుకున్నారు. మరి.. ఆలియా గెలుచుకుంటారా? అభిమానుల చేతుల్లోనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement