రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్ | Four nominated to Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్

Published Sun, Jul 15 2018 7:39 AM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్‌ స్థానాలు భర్తీ అయ్యాయి. ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త రాకేశ్‌ సిన్హా, లోక్‌సభ మాజీ సభ్యుడు రామ్‌ సకల్,  సంప్రదాయ నృత్యకారిణి సోనాల్‌ మాన్‌సింగ్, శిల్పి రఘునాథ్‌ మహాపాత్రోలు రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్‌ వీరిని ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది. ఇటీవలే పదవీకాలం ముగిసిన  క్రీడాకారుడు సచిన్, నటి రేఖ, న్యాయవాది పరాశరణ్, సామాజిక కార్యకర్త అను ఆగాల స్థానంలో వీరిని ఎంపికచేశారు. వీరి పదవీకాలం 2024లో ముగుస్తుంది.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement