తెలంగాణ రాష్ట్రం వచ్చి... జిల్లాల విభజన, మండలాల విభజన, డివిజన్ల విభజన పూర్తయి అధికారులు కొలువులు సైతం చేపట్టినా కొన్ని ప్రాంతాల్లో నామినేటెడ్ పదవులకు మాత్రం మోక్షం రావడం లేదు.
వేములవాడ రూరల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చి... జిల్లాల విభజన, మండలాల విభజన, డివిజన్ల విభజన పూర్తయి అధికారులు కొలువులు సైతం చేపట్టినా కొన్ని ప్రాంతాల్లో నామినేటెడ్ పదవులకు మాత్రం మోక్షం రావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన నాయకులు నామినేటెడ్ పదవులు వస్తాయని ఎదురు చూడడానికే రెండేళ్ల కాలం గడిచిపోయింది.
మార్కెట్ కమిటీగా నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు ప్రమాణ స్వీకారానికి నోచుకోక, అటు కార్యాలయాలకు వెళ్లలేక, ఇటు పదవులు పొందామని సంతోషపడలేక 30 రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వేములవాడ నియోజక వర్గంలోని చందుర్తి, కథలాపూర్, మేడిపల్లి, వేములవాడ, మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో చందుర్తి మండలం, రుద్రంగి మండలాన్నిరూరల్ కేంద్రంగా, వేములవాడను రూరల్ మండలంగా ఏర్పాటు చేశారు. బోయినపల్లిని వేములవాడలో కలుపుతూ ప్రభుత్వం రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసింది. పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి హరీష్‌రావును పిలిపించి, ఫాజుల్‌నగర్‌లో భారీ ఎత్తున సభకు ప్రణాళికను సిద్ధం చేశారు ఎమ్మెల్యే రమేష్‌బాబు.
ఆరోజే ఎమ్మెల్యే మాతృవియోగాన్ని పొందటంతో కార్యక్రమం వాయిదా పడింది. కొత్త జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమైంది , నేడో రేపో ప్రమాణ స్వీకారానికి మూహూర్తం కలిసొస్తుందని మార్కెట్ కమిటి పదవులు పొందిన నాయకులు ఎదురు చూస్తున్నారు.
మార్కెట్‌లో ధర పలుకుతున్న పత్తి
సీఎం ఆదేశాల మేరకు వేములవాడలో ఏడాది రైతులు పత్తిపంటను వేసి నీటిలో మునిగి నష్టపోగా 15వేల ఎకరాల్లో పంట చేతికి అందే దశలో ఉందని ఏఒ బండ సంతోష్ తెలిపారు. పత్తి పంటను గత పది రోజుల నుండి మొదటి కాపుగా పత్తిని తీస్తున్నారని తెలిపారు. మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి రూ.5వేల నుంచి 6వేలకు పైగా పలుకుతుందని అధికారులు తెలిపారు.