సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. నామినేటెడ్ పదవుల కసరత్తు పూర్తయిందని, ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడవచ్చని మూడు రోజులుగా గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజున శనివారం రాత్రి అనధికారిక సమాచారం మీడియాకు అందింది. అయితే, ఈనెల 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడినట్టు ఇందులో పేర్కొన్నారు.
పదవుల పంపిణీ ఇలా...
1) పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్; 2) కె.శివసేనారెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ; 3) ఎన్.ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్; 4) నూతి శ్రీకాంత్–బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్; 5) ఎస్.అన్వేశ్ రెడ్డి–విత్తనాభివృద్ధి కార్పొరేషన్; 6) ఈరవత్రి అనిల్–మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్; 7) ఎం.విజయబాబు – సహకార, గృహనిర్మాణ సమాఖ్య; 8) రాయల నాగేశ్వరరావు – వేర్ హౌసింగ్ కార్పొరేషన్; 9) కాసుల బాలరాజు– ఆగ్రో ఇండస్ట్రీస్; 10 నేరెల్ల శారద – మహిళా కమిషన్;
11) బంట్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్; 12) సీహెచ్ జగదీశ్వర్‌రావు – నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్; 13) జంగా రాఘవరెడ్డి – నూనె గింజల పెంపకందారుల సమాఖ్య; 14) మానాల మోహన్‌రెడ్డి – కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్; 15) బెల్లయ్యనాయక్ – గిరిజన, సహకార, ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్; 16) ఆర్,గురునాథ్‌రెడ్డి– పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్; 17) జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ – డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్; 18) చల్లా నర్సింహారెడ్డి యూఎఫ్‌ఐడీసీ; 19) మెట్టు సాయికుమార్ – మత్స్యసహకార సొసైటీల సమాఖ్య; 20) కొత్తాకు నాగు – ఎస్టీ సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ;
21) జనక్ ప్రసాద్ – కనీస వేతన సలహా మండలి; 22) ఎండీ రియాజ్ – గ్రంథాలయ పరిషత్; 23) ఎం.వీరయ్యవర్మ – వికలాంగుల కార్పొరేషన్; 24) నాయుడు సత్యనారాయణ – చేనేత; 25) ఎంఏ జబ్బార్ – వైస్ చైర్మన్, మైనార్టీస్ ఫైనాన్స్; 26) నిర్మలా జగ్గారెడ్డి – పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ); 27) మల్‌రెడ్డి రాంరెడ్డి – రహదారుల అభివృద్ధి; 28) కల్వ సుజాత – వైశ్య కార్పొరేషన్; 29) పొడెం వీరయ్య – అటవీ అభివృద్ధి; 30) ప్రకాశ్‌రెడ్డి – ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్;
31) కె.నరేందర్‌రెడ్డి – సుడా(శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్); 32) పుంజాల అలేఖ్య – సంగీత నాటక అకాడమీ; 33) గిరిధర్‌రెడ్డి – చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌టీసీ); 34) మన్నె సతీ‹Ùకుమార్ – టీఎస్‌టీఎస్; 35) జెరిపేటి జైపాల్ – అత్యంత వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఎంబీసీ); 36) వెంకట్‌రాంరెడ్డి – కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా), 37) ఎంఏ ఫయీం – తెలంగాణ ఫుడ్స్
(నోట్: ఈ జాబితా అనధికారిక సమాచారం మేరకు మాత్రమే. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ నెల 14నే ఇచ్చినా ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా వెలువడించాల్సి ఉంది.)
Comments
Please login to add a commentAdd a comment