సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విశాల్ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
తొలుత నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించగానే విశాల్ తన అభిమానులతో ధర్నాకు దిగగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నాటకీయ పరిణామాల తర్వాత రిటర్నింగ్ అధికారిని కలిసిన విశాల్ వివరణ ఇచ్చుకున్నాడు. దానిపై సంతృప్తి చెందిన అధికారి విశాల్ నామినేషన్‌ను అంగీకరించారు. అనంతరం బయటకు వచ్చిన విశాల్ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశాడు.
‘‘నా నామినేషన్‌ను ఈసీ అంగీకరించింది. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా’’ అని విశాల్ ప్రకటించాడు. తన మద్దతుదారులను బెదిరించారని.. అయినా నా పోరాటం గెలిచిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment