
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.
నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు.
విశాల్ అరెస్ట్...
నామినేషన్ తిరస్కరణపై విశాల్ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment