
వెంకయ్య నామినేషన్, అగ్రనేతల హాజరు
ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్య నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ కార్యదర్శికి సమర్పించారు. నామినేషన్ పత్రాలపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ సంతకాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, కేంద్ర మంత్రులు అనంత కుమార్, నితిన్ గడ్కరీ, పాశ్వాన్ తదితరులు ఆయన వెంట వచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మరోవైపు కేంద్ర మంత్రి పదవికి వెంకయ్య నాయుడు చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. సమాచార, ప్రసార శాఖను అదనంగా స్మృతీ ఇరానీకి అప్పగించారు. నరేంద్ర సింగ్ తోమర్‌కు పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు అదనంగా ఇచ్చారు.