
నామినేషన్ వేయడానికి వస్తున్న డాక్టర్ శంకరేగౌడ (కుడివైపున)
మండ్య: మండ్య నగరంలో ఐదు రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెంది న డాక్టర్. ఎస్.సి. శంకరేగౌడ ఎన్నికల నాడిని పరీక్షిస్తున్నారు. సోమవారం ఆయన మండ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశా రు. నగరంలోని బందీగౌడ లేఔట్‌లో ఉన్న నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న మహా పురుషుల విగ్రహాలకు పూలహారం వేసి నివాళులర్పించారు. తరువాత తాలూకా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రోగుల నుంచి కేవలం ఐదు రూపాయలు ఫీజుగా తీసుకునే శంకరేగౌడ నామినేషన్ డిపాజిట్ నగదు రూ.10 వేలను కూడా ఐదు రూపాయల నాణేలనే ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment