అమరావతి, సాక్షి: నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ పదవుల మీద ఆశ ఉంటుందని, కానీ.. పదవులు అడిగే వాళ్లు వాళ్ల అనుభవాలను, వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగాలని కోరారాయన.
సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు.
నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు. కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు. ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదు. మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం. అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా.
ఇదీ చదవండి: ఇంత ఘోరంగా మోసం చేస్తారా?
కానీ.. ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించండి. ప్రధానిని నేనూ కెబినెట్ పదవి అడగగలను.. కానీ నేను అడగలేదు. పదవుల కోసం మనం పని చేయడం లేదు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం. కష్టపడిన వారిని మరిచిపోం’’ అని అన్నారాయన.
కూటమి విజయానికి జనసేన నిర్ణయం తీసుకోవడమే కారణం. నేను ఉపముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదు. ప్రభుత్వంలో భాగం కావడం పెద్ద బాధ్యత అని పవన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment