‘స్థానిక’ ఎమ్మెల్సీకి ‘వివేకా’ నామినేషన్‌ | YS Vivekananda Reddy Files Nomination For MLC Election in Kadapa | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎమ్మెల్సీకి ‘వివేకా’ నామినేషన్‌

Published Fri, Feb 24 2017 1:42 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

‘స్థానిక’ ఎమ్మెల్సీకి ‘వివేకా’ నామినేషన్‌ - Sakshi

‘స్థానిక’ ఎమ్మెల్సీకి ‘వివేకా’ నామినేషన్‌

కడప సెవెన్‌రోడ్స్‌: శాసనమండలి కడప స్థానిక సంస్థల నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.07 గంటలకు వైఎస్సార్‌ జిల్లా కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి శ్వేత తెవతీయకు ఆయన ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను అంద జేశారు. ఆ తర్వాత  1.15 గంటలకు మరో సెట్, 1.24 గంటలకు ఇంకో సెట్‌ కలిపి మొత్తం 3సెట్ల  పత్రాలను సమర్పించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి కడప స్థానిక సంస్థల నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

 కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి వాహనాల్లో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మేయర్‌ సురేష్‌బాబు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement