
పాలనలో మహిళలకు భాగస్వామ్యం
పరిపాలనలో మహిళలకు భాగస్వామ్యం కల్పించేందుకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి, మహిళాభ్యుదయానికి కృషిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎంకేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్:
పరిపాలనలో మహిళలకు భాగస్వామ్యం కల్పించేందుకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి, మహిళాభ్యుదయానికి కృషిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎంకేసీఆర్ నిర్ణయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్లతోపాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో వీరికి అవకాశమిచ్చేందుకు అర్హులైన మహిళలను గుర్తించి ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ నుంచి వచ్చే సూచనల మేరకు కొద్ది రోజుల్లోనే మహిళలకు పదవులు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.