
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మహాత్మా గాంధీ, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ వంటి మహాత్ముల కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే అందుతున్నాయని తెలిపారు.
సామాజిక న్యాయమే ప్రభుత్వ విధానంగా పాలన సాగుతోందని ప్రశంసించారు. నామినేటెడ్ పదవుల్లో సైతం సామాజిక న్యాయం ప్రస్ఫుటంగా కనిపించిందన్నారు. రాజ్యాధికారంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం భాగస్వాములను చేశారన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. కొత్తగా పదవుల్లో చేరిన వారు ఆశ్రిత పక్షపాతం లేకుండా మంచి పాలనను అందించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment