సాక్షి, హైదరాబాద్: మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసేలా అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలంటూ తాను విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించకపోవడంతో ఈ విషయంలో బీఆర్‌ఎస్ వైఖరి అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు, హుజూరాబాద్ తరహాలో మరోసారి మద్యం, డబ్బుతో ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుందని, డబ్బు, మద్యం పంపిణీ చేయదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మేం ఎక్కడా మద్యం, డబ్బు పంచలేదు
దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్ని కని ఆనాడు విశ్లేషకులు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. మునుగోడులో కూడా మద్యం ఏరులై పారిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండు చోట్లా చుక్క మందు కానీ, డబ్బు కానీ పంచలేద న్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధిని కేసీఆర్ పక్కనబెట్టారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ను తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు.
నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలి పేలా ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రవళిక మరణంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ప్రవళిక కుటుంబ సభ్యు లను తాను రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లాలను కుంటే.. ప్రగతిభవన్‌లో బంధించారని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి
రాష్ట్రంలో రిటైర్డ్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని, వీరికి ఎన్నికల నియ మావళి వర్తించదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బంధువులు, కావలసిన కొందరు రిటైర్డ్ అధికారు లను ప్రైవేటు సైన్యంగా చేసుకొని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని, కానీ 2 లక్షల ఉద్యోగాల ఊసు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు.
ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని, అప్పుడే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగులు కేసీఆర్‌పై కదం తొక్కాలని, 30 లక్షల నిరుద్యోగ యువకులు కాంగ్రెస్‌కు ఓటు వేయడంతో పాటు తల్లిదండ్రులతో కూడా వేయిస్తే 90 లక్షల ఓట్లతో పాటు 90 సీట్లు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకా లు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.
గోషామహల్‌లో ఎంఐఎం పోటీ చేయదా?
కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎన్నికవుతూ వస్తున్న షబ్బీర్ అలీ అనే మైనారిటీ నేతను ఓడించేందుకు కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓ మైనారిటీని ఓడించేందుకు పోటీ చేస్తున్న కేసీఆర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మద్దతివ్వడం వెనుకున్న ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఎంఐఎంను, ఒవైసీ కుటుంబాన్ని దూషించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాల న్నారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ముగ్గురు ఒక్కటేనని, వారి ఒప్పందంలో భాగంగానే గోషా మహల్‌లో రాజాసింగ్‌పై ఎంఐఎం పోటీ చేయడం లేదని చెప్పారు.
మద్యం, డబ్బుతో కేసీఆర్ సిద్ధం: రేవంత్
Published Wed, Oct 18 2023 2:37 AM | Last Updated on Wed, Oct 18 2023 2:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment