సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చే హామీల కూర్పుపై టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ వరుసగా రెండోరోజు సమావేశమైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు హాజరై మేనిఫెస్టోలో పొందుపర్చా ల్సిన అంశాలపై చర్చించారు.
కాగా, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని సోషల్ డెమొక్రటిక్ ఫోరం ప్రతినిధులు గాంధీభవన్‌కు వచ్చి మేనిఫెస్టో కమిటీతో చర్చించారు. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, రాష్ట్రంలో చేపట్టాల్సిన కులగణన వంటి అంశాలపై కమిటీకి పలు సూచనలందించారు. దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్ గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు చార్జిషీట్ కమిటీ సమావేశం
టీపీసీసీ చార్జిషీట్ కమిటీ భేటీ గురువారం గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ సంపత్‌కుమార్ అధ్యక్షతన జరగనుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు జెట్టి కుసుమకుమార్ అధ్యక్షతన టీపీసీసీ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశం జరగనున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment