
పార్టీ కోసం కష్టపడితే సాధారణ కార్యకర్త అయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందని
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పార్టీ కోసం కష్టపడితే సాధారణ కార్యకర్త అయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. చెప్పిన మాట మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడినే చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడిగా దళితుడిని నియమించిందన్నారు. బీఆర్‌ఎస్‌లో మాత్రం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ చేతిలోనే అన్నారు. కాంగ్రెస్‌లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు అందలం దక్కుతుందన్నారు. సీతక్క కావచ్చు, భట్టి విక్రమార్క, తాను, మరెవరైనా సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధం కావడంతో వాళ్ల కుటుంబంలో అలజడి నెలకొందన్నారు.