టీపీసీపీ ఛీఫ్‌కు రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎమోషనల్‌ కామెంట్స్‌ | CM Revanth Reddy Emotional Comments Over TPCC Chief Post | Sakshi
Sakshi News home page

టీపీసీపీ ఛీఫ్‌కు రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎమోషనల్‌ కామెంట్స్‌

Published Fri, Sep 6 2024 9:14 PM | Last Updated on Fri, Sep 6 2024 9:14 PM

CM Revanth Reddy Emotional Comments Over TPCC Chief Post

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమించబడిన మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తాను పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం రేవంత్‌ కృతజ్ఞతలు చెప్పారు.

కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘పీసీసీ అధ్యక్షుడిగా నన్ను నియమించిన నాటి నుంచి సోనియా గాంధీ నాకు పూర్తి సహాకారం, స్వేచ్ఛ ఇచ్చారు. నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. పీసీసీగా భారత్ జోడో యాత్ర నిర్వహాణ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. డిజిటల్ మెంబర్‌షిప్‌ ద్వారా రాష్ట్రంలో పార్టీ బలాన్ని నిరూపించాం. తుక్కుగూడ బహిరంగతో రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించి విజయం సాధించాం. తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యాలను సమర్దవంతంగా ఎండగట్టగలిగాం.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ మద్దతు మరచిపోలేనిది. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ, పార్టీ నాయకులకు, సహచరులకు, కాంగ్రెస్ సైనికులకు ధన్యవాదాలు. మీ అందరి సహకారం చెప్పలేదని అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement