ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్ చేయడానికేనని విరసం నేత వరవరరావు వ్యాఖ్యానించారు. ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందిస్తూ... ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు.