ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారని, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారని పుణె పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, చీకుడి ప్రభాకర్, తదితర హక్కుల సంఘాల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మావోయిస్టులను హతమార్చిన గడ్చిరోలీ ఘటనపై గళం ఎత్తుతున్న వారిపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా వరవరరావుపై కుట్ర నమోదుచేశారని, ఢిల్లీ, మహారాష్ట్రలో హక్కుల సంఘాల నేతలు ఐదుగురిని ఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని వారు అన్నారు.