Viplava Rachayitala Sangham
-
వరవర రావుకు బెయిల్
ముంబై/ సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుకి ముంబై హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఎల్గార్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 ఆగస్టు 28న వరవర రావుని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా వరవర రావుకు తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఆయన భార్య హేమలత వరవరరావు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. 82 ఏళ్ళ వరవరరావు వయసు, అతని తీవ్ర అనారోగ్య పరిస్థితి, తలోజా జైలులో ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పైటేల్ల ధర్మాసనం బెయిల్ మంజూరుచేసింది. ‘ఉపశమనం ఇవ్వదగిన కేసు ఇది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వవచ్చు. తక్షణమే ఆయన్ను విడుదల చేయండి’అని కోర్టు ఆదేశించింది. హైకోర్టు జోక్యంతో గత ఏడాది నవంబర్‌లో వరవరరావుని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 1న వాదనలు ముగిశాక బెయిల్ అంశాన్ని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ప్రస్తుతం ముంబై నానావతీ ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. వరవరరావుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై మూడు వారాల పాటు స్టే విధించాలంటూ, ఎన్ఐఏ తరఫున వాదిస్తోన్న అడిషనల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే, వరవరరావుకి బెయిలు మంజూరు చేస్తూ షరతులను కోర్టు విధించింది. వరవరరావు ఎన్ఐఏ కోర్టు పరిధిలో ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. రూ.50వేల వ్యక్తిగత బాండు, అదే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది. తన సహనిందితులతోనూ, ఈ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారెవరితోనూ వరవరరావు సంబంధాలు నెరపరాదని కోర్టు చెప్పింది. వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోన్లు చేయరాదని కోర్టు సూచించింది. 15రోజులకు ఒకసారి పోలీసులకు వరవరరావు వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలి. అన్ని కోర్టు విచారణలకు హాజరుకావాలని, కోర్టు సమన్లకు స్పందించాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో వరవరరావుని కలిసేందుకు సందర్శకులను అనుమతించబోమని, ఆయన పాస్‌పోర్టుని ఎన్ఐఏ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి మీడియా ఎదుట ప్రకటనలు చేయడాన్ని కోర్టు నిషేధించింది. వరవరరావుని కలిసేందుకు న్యాయవాదులకు, కార్యకర్తలకు అనుమతివ్వాలని వరవరరావు తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆరునెలల వ్యవధి ముగిశాక ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుకావాలని, లేదా బెయిలు పొడిగింపునకు హైకోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
మోదీ హత్యకుట్ర.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారని, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారని పుణె పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, చీకుడి ప్రభాకర్, తదితర హక్కుల సంఘాల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మావోయిస్టులను హతమార్చిన గడ్చిరోలీ ఘటనపై గళం ఎత్తుతున్న వారిపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా వరవరరావుపై కుట్ర నమోదుచేశారని, భీమా కోరేగావ్ ఆందోళనలకు సంబంధించి ఢిల్లీ, మహారాష్ట్రలో హక్కుల సంఘాల నేతలు ఐదుగురిని ఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని వారు అన్నారు. ఆ వార్తల్లో నిజం లేదు : వరవరరావు ప్రధాని మోదీ హత్యమార్చడానికి మావోయిస్టులు రాసిన లేఖలో తన పేరు ఉందన్న కథనాలు అవాస్తమవని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌ట్యాప్‌లో దొరికిందని పేర్కొంటున్న కుట్ర లేఖ అబద్ధమని, ఆ లేఖలో తన పేరు ప్రస్తావించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని విమర్శించారు. మోదీ హత్యకు కుట్ర అంటూ పూణే పోలీసులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘ ఈ కేసులో మీడియా వ్యవహరించిన తీరు దురదృష్టకరం. ఓ చానల్ ఇంటర్వ్యూ నుంచి నేను వాకౌట్ చేశాను. చర్చలో పాల్గొనేవారు కాదు యాంకరే స్వయంగా నాపై దాడి చేశారు. మావోయిస్టుల శైలి ఏంటో మీడియాకు తెలుసు. మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఆ లేఖలు ఎలా ఉన్నాయో అలానే మీడియా ప్రచురించాలి. ఎవరైనా అవి పార్టీ రాసిన లేఖలు అంటే నమ్ముతారా?’ అని వరవరరావు అన్నారు. రోనాల్డ్ విల్సన్ తనకు తెలుసునని, రాజకీయ ఖైదీల విడుదల కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. హక్కుల సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేసి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని బీజేపీ భావిస్తోందని వరవరరావు మండిపడ్డారు. వరంగల్‌లో అరెస్ట్ చేసిన డీఎస్‌యూ యూనియన్ నాయకులు భద్రి, రంజిత్ సూరి, సుధీర్లను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. -
ప్రజా ఉద్యమాలను అణిచివేతకు యత్నం
-
'ఆ ముగ్గురు పెట్టుబడిదారుల పక్షానే పని చేస్తున్నారు'
విజయవాడ : ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పెట్టుబడిదారుల పక్షానే పని చేస్తున్నారని విరసం నేతలు ఆరోపించారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో విరసం 25వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు విరసం నేతలు వరవరరావు, కల్యాణరావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సామ్రాజ్యవాదం, హిందుత్వ వ్యతిరేక పోరాటాలకు విరసం ఉద్యమిస్తుందని వారు స్పష్టం చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలోని బాధిత రైతుల్లో చైతన్యం తీసుకు వస్తామన్నారు. పోలవరం ముంపు పేరుతో 7 మండలాలను ఏపీలో కలపడం వెనుక ఆదివాసి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర దాగి ఉందని విరసం నేతలు విమర్శించారు.