'ఆ ముగ్గురు పెట్టుబడిదారుల పక్షానే పని చేస్తున్నారు'
విజయవాడ : ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పెట్టుబడిదారుల పక్షానే పని చేస్తున్నారని విరసం నేతలు ఆరోపించారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో విరసం 25వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు విరసం నేతలు వరవరరావు, కల్యాణరావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సామ్రాజ్యవాదం, హిందుత్వ వ్యతిరేక పోరాటాలకు విరసం ఉద్యమిస్తుందని వారు స్పష్టం చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలోని బాధిత రైతుల్లో చైతన్యం తీసుకు వస్తామన్నారు. పోలవరం ముంపు పేరుతో 7 మండలాలను ఏపీలో కలపడం వెనుక ఆదివాసి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర దాగి ఉందని విరసం నేతలు విమర్శించారు.