siddhartha auditorium
-
విజయవాడ : దసరా సందర్భంగా సిద్ధార్థ ఆడిటోరియంలో యువజనోత్సవాలు (ఫొటోలు)
-
మంజునాథ కమిషన్ ఎదుట కులసంఘాల ఆందోళన
► అభిప్రాయాలు చెప్పేందుకు రావాలని పిలిచి లోనికి అనుమతించని పోలీసులు ► ఆగ్రహం వ్యక్తం చేసిన పలు సంఘాలు మొగల్రాజపురం (విజయవాడ తూర్పు) : మంజునాథ కమిషన్‌కు అభిప్రాయాలు చెప్పేందుకు రావాల్సిందిగా సమాచారం ఇచ్చి ఇప్పుడు లోపలకు రానీయకుండా ఆంక్షలు పెట్టడం సరికాదంటూ వివిధ కుల సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంజునాథ కమిషన్ సోమవారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియం ఆవరణలో కుల సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆడిటోరియం లోపలకు పరిమిత సంఖ్యలోనే నాయకులను అనుమంతించడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ çసంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషన్‌కు వివరించి న్యాయం చేయమని అడుగుదామంటే లోపలకు వెళ్లనీయకపోవడం సరికాదంటూ నినాదాలు చేశారు. బీసీ డీ నుంచి ఎ లోకి మార్చాలి: బీసీడీ గ్రూపు నుంచి ఏ గ్రూపులోకి మార్చాలంటూ విజయవాడ నాగవంశం సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు ఎరుబోతు రమణరావు డిమాండ్ చేశారు. 44 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వెనుకబడిన తరగతుల కమిషన్లను, వెనుకబడిన శాసనసభా కమిటీ వారికి అనేకసార్లు ఈ అంశంపై వివరించామని తెలిపారు. ఇప్పటికైనా తమను బీసీ ఎ గ్రూపులోకి మార్చాల్సిందిగా కోరారు. కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అధిక సంఖ్యలో నాగవంశీయులు కళాశాల దగ్గరకు వచ్చారు. ఆడిటోరియంలోపల కేవలం 300 మంది వరకే పరిమితం అని, అందువల్ల అందరినీ లోపలకు పంపడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం పది మందికి మాత్రమే లోపలకు వెళ్ళాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో నాగవంశీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ మంజునాథ కమిషన్: రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చడం అంటే ప్రస్తుతం ఉన్న బీసీ కులాలకు రిజర్వేషన్లను దూరం చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.మహేష్ అన్నారు. మంజునాథ కమిషన్ ఎదుట తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం ఉన్న బీసీ జనాభాకు కేవలం 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, ఎన్నో సంవత్సరాల నుంచి 50 శాతంకు పెంచాలని పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతుందని మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో కాపులు పడొద్దు: కాపులను బీసీ జాబితాలో చేరుస్తామంటూ చంద్రబాబునాయుడు కాపులను మోసం చేస్తున్నాడని ఆ ఉచ్చులో కాపు సోదరులు పడవద్దని బీసీ జనసభ అధ్యక్షుడు గంగాధర్ అన్నారు. మంజునాథ కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బీసీ జాబితాలో చేరుస్తామంటున్నాడని ఈ విషయాన్ని కాపులను గమనించాలని చెప్పారు. బుడబుక్కల సంఘం సంక్షేమ సోసైటీ వ్యవస్థాపకుడు దాసరి సత్యం మాట్లాడుతూ తమ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గంగిరెద్దుల కులస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.చిన్న అమ్మోరయ్య మాట్లాడుతూ తమ కులాన్ని బీసీ ఏ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. భారీగా పోలీసుల మొహరింపు..ట్రాఫిక్ కష్టాలు: మంజునాథ కమిషన్ అభిప్రాయ సేకరణ సందర్భంగా మొగల్రాజ్పురం పరిసర ప్రాంతాల్లోని రహదారులపై భారీగా పోలీసుల మోహరించారు. బోయపాటి శివరామకృష్ణయ్య కార్పొరేషన్ స్కూల్ దగ్గర నుంచి ట్రాఫిక్‌ను వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రోడ్డులోకి మళ్లించారు. ఆ రోడ్డు వెడల్పు తక్కువుగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిద్ధార్ధ, మధర్‌ధెరిస్సా జంక్షన్లను కూడా పోలీసులు ఆధీనంలో ఉండటంతో ఎటువైపు వెళ్లాల్లో ద్విచక్రవాహనచోదకులకు తెలియలేదు. సిద్ధార్ధ జంక్షన్‌కు చేరుకున్న వారిని తిరిగి వెనక్కు వెళ్లాలని పోలీసులు చెప్పడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
అవసరంలో సాయంతోనే సార్థకత
విజయవాడ (మొగల్రాజపురం) : అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే చేసిన సాయానికి సార్థకత లభిస్తుందని కమ్మ విద్యార్థి సహాయ సంఘం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం కమ్మ కులానికి చెందిన వారికే కాకుండా అన్ని కులాల వారికి ఉపకార వేతనాలను అందజేస్తున్నామని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యారంగంలోSచేయుత ఇవ్వాలనే ఉద్దేశంలో 1994 నుంచి విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఉపకార వేతనాలను ఇవ్వడమే కాకుండా విద్యార్హతకు తగినట్లుగా ఉద్యోగాలు వచ్చేలా కూడా చేయూతనిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం కార్యదర్శి పర్వతనేని ప్రభాస్ మాట్లాడుతూ పదో తరగతి నుంచి మెడిసిన్ వరకు సుమారు 400 మంది విద్యార్థులకు రూ.22 లక్షలు ఉపకార వేతనాలుగా అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి సి.కృష్ణారావు, రాజయ్య, ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ ముగ్గురు పెట్టుబడిదారుల పక్షానే పని చేస్తున్నారు'
విజయవాడ : ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పెట్టుబడిదారుల పక్షానే పని చేస్తున్నారని విరసం నేతలు ఆరోపించారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో విరసం 25వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు విరసం నేతలు వరవరరావు, కల్యాణరావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సామ్రాజ్యవాదం, హిందుత్వ వ్యతిరేక పోరాటాలకు విరసం ఉద్యమిస్తుందని వారు స్పష్టం చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలోని బాధిత రైతుల్లో చైతన్యం తీసుకు వస్తామన్నారు. పోలవరం ముంపు పేరుతో 7 మండలాలను ఏపీలో కలపడం వెనుక ఆదివాసి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర దాగి ఉందని విరసం నేతలు విమర్శించారు. -
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది
తెలుగు సాహితీ సదస్సులో బుద్ధప్రసాద్ విజయవాడ కల్చరల్ : ప్రపంచం తెలుగువారికి వేదిక కావాలని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సులో మాట్లాడుతూ,తెలుగు భాషాసంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు సమాఖ్యఅని, భాషా సంస్కృతులను వాటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి అభివృద్ధికోసం ప్రపంచ తెలుగు సమాఖ్య పాటుపడుతోందని వివరించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారిని ఏకం చేసేది సాంస్కృతిక వారసత్వమేనని గుర్తుచేశారు. రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని కొత్తరాష్ట్రంలోని కవులు రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచేలా రచనలు చేయాలని ఉద్భోదించారు. భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ భాషా సంస్కృతీ సంప్రదాయాలను కవులు గౌరవించి తమ రచనల ద్వారా తెలుగు జాతిని జాగృత పరచాలన్నారు. కవి సమ్రాట్ విశ్వనాథ ఇంటిని ముఖ్యమంత్రి గారితో కలసి సందర్శించి, విశ్వనాథగృహాన్ని తెలుగు భాషా సంస్కృతులు వెల్లివిరిసేలా పరిరక్షిస్తామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు జ్యోతిని వెలిగించి తెలుగు సాహితీ సదస్సులను ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు వియల్ ఇందిరాదత్ మహాసభ లక్ష్యాలను వివరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు ఆవుల మంజులత, సిద్ధార్థఅకాడమీ కార్యదర్శి పాలడుగు లక్షణరావు, కష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాలడుగు లక్షణరావు పాల్గొన్నారు. మాతెలుగు తల్లికి మల్లెపూదండ... సభా ప్రారంభానికి ముందు ప్రపంచ తెలుగు సమాఖ్య అద్యక్షులు వి.ఎల్. ఇందిరాదత్, పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం పూర్వధ్యక్షులు ఆవుల మంజులత,కవులు డాక్టర్ జి.వి.పూర్ణచందు, చలపాక ప్రకాష్, గుమ్మా సాంబశివరావు, ఎరుకలపూడి గోపీనాథరావు, సీహెచ్.బృందావనరావు కళాక్షేత్రం వద్దనున్న తెలుగు తల్లివిగ్రహానికి పూలమాలలు వేశారు. పరిశోధనా పత్రాలు సమర్పణ... వెంకటగిరి సంస్థానంలో తెలుగు సాహిత్య కృషి అంశంపై డాక్ట్ర్ సాయికృష్ణ యాచేంద్ర ,తెలుగు ప్రాచీన సాహిత్యం సామాజిక అంశాల అవశ్యకతపై యార్లగడ్డ బాలగంగాధరరావు, నన్నయ్య పూర్వయగంపై ఆచార్య టి .సత్యవతి, కాకతీయానంతర సాహిత్య నేపథ్యంపై ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్,శిష్యబృందం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుంది.