
న్యూఢిల్లీ : నిజమైన దేశభక్తుడికి కుమారుడిగా జన్మించినందుకు గర్విస్తున్నానని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. నేడు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా రాహుల్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, పరోపకారి అయిన తండ్రికి కొడుకు అయినందుకు గర్విస్తున్నాను. ప్రధాన మంత్రిగా రాజీవ్ గారు దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించారు. తన దూరదృష్టితో దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా.. అప్యాయతతో, కృతజ్ఞతతో ఆయనకు నమస్కరిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించింది. రాజీవ్‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. ‘యువ భారతం నాడీ తెలిసి వ్యక్తి. మనల్ని ఉజ్వలైన భవిష్యత్తు వైపు నడిపించిన వ్యక్తి. యువత, వృద్ధుల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి.. అంతేకాకుండా అందరిచేత ప్రేమించబడ్డ వ్యక్తి’ అని పేర్కొంది. మరోవైపు రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి.
एक सच्चे देशभक्त,उदार और परोपकारी पिता के पुत्र होने पर मुझे गर्व है।प्रधानमंत्री के रूप में राजीव जी ने देश को प्रगति के पथ पर अग्रसर किया।अपनी दूरंदेशी से देश के सशक्तीकरण के लिए उन्होंने ज़रूरी कदम उठाए।आज उनकी पुण्यतिथि पर मैं स्नेह और कृतज्ञता से उन्हें सादर नमन करता हूँ। pic.twitter.com/aDdKMf74wK
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2020