అయోధ్య తలుపులు తెరవడం రాజీవ్ తప్పు: ప్రణబ్ | rajiv gandhi made mistake by opening ayodhya doors, says pranab in his book | Sakshi
Sakshi News home page

అయోధ్య తలుపులు తెరవడం రాజీవ్ తప్పు: ప్రణబ్

Published Thu, Jan 28 2016 7:26 PM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

నాటి ప్రధాని రాజీవ్ గాంధీతో ముచ్చటిస్తున్న ప్రణబ్ ముఖర్జీ(ఫైల్ ఫొటో) - Sakshi

నాటి ప్రధాని రాజీవ్ గాంధీతో ముచ్చటిస్తున్న ప్రణబ్ ముఖర్జీ(ఫైల్ ఫొటో)

అయోధ్య తలుపులు తెరవడం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన పెద్ద తప్పని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఆయన విడుదల చేసిన పుస్తకం రెండో సంపుటిలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. కొన్ని నిజాలు తనతోనే సమాధి అవుతాయని ప్రణబ్ అందులో రాశారు. తన డైరీని డిజిటలైజ్ చేయాల్సిందిగా తన కుమార్తెకు చెప్పానని, అయితే అందులోని అంశాలు మాత్రం ఎప్పటికీ బహిర్గతం కావని ప్రణబ్ తెలిపారు. తానెప్పుడూ ప్రధానమంత్రి పదవిని ఆశించలేదని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత తాను ప్రధానమంత్రి అవ్వాలనుకున్నానని అనడంలో అర్థం లేదని చెప్పారు.

ఈ విషయంపై రాజీవ్ గాంధీతో జరిగిన సంభాషణను కూడా ఆయన తన పుస్తకంలో పొందుపరిచారు. అయోధ్య తలుపులు తెరవడం రాజీవ్ గాంధీ చేసిన పొరపాటని ఆయన రాశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన భారత దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని అభిప్రాయపడ్డారు. ద టర్బులెంట్ ఇయర్స్ 1980-96 అనే పుస్తకంలో పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ప్రధాని పదవి, బాబ్రీ మసీదు కూల్చివేత, రాష్ట్రపతి పాలన.. ఇలాంటి అంశాలపై తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement