భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ మేరకు మోదీ గురువారం ట్విట్ చేశారు. 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే.