న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో పంచాయతీ వ్యవస్థ కీలకంగా మారిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అవసరార్థులను చేరుకోవడంలో పంచాయతీ వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. ‘ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. స్థానిక, స్వీయ పరిపాలన సృష్టికర్త అయిన రాజీవ్ గాంధీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాను. పంచాయతీ అధిపతులు, స్థానిక సంస్థల సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశంలో సహాయం అవసరమైన ప్రతిఒక్కరిని గుర్తించడంలో పంచాయతీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంద’ని రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్పంచ్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ-గ్రామ స్వరాజ్‌పోర్టల్‌ను ప్రధాని ప్రారంభించారు. కరోనా విలయంతో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment