ఢిల్లీ: కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్ తాజా నివేదికలో అంచనావేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇది మోదీ సాధించిన భారీ విజయం అంటూ ఎద్దేవా చేశారు. అలానే కోవిడ్ కట్టడిలో పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ వంటి దేశాలు భారత్ కంటే ఉత్తమంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) విధానం ప్రకారం చూస్తే, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019లో బంగ్లాదేశ్‌కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. తలసరి ఆదాయంలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావిస్తూ, ‘‘ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. (చదవండి: తలసరి ఆదాయంలో భారత్‌ను మించనున్న బంగ్లా!)
Another solid achievement by the BJP government.
— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2020
Even Pakistan and Afghanistan handled Covid better than India. pic.twitter.com/C2kILrvWUG
Comments
Please login to add a commentAdd a comment