సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన అని చెప్పుకొచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోనియా, రాహుల్‌ను నాడు తిట్టిన కారణంగానే నేడు కవర్ చేసుకునేందుకే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు.
కాగా, జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన చేపట్టారు.
నాడు సోనియా గాంధీని బలిదేవత, రాహుల్ గాంధీని ముద్ద పప్పు అని తిట్టారు. వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేశారు. రాజీవ్ కంప్యూటర్ కనిపెట్టారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కంప్యూటర్ కనిపెట్టిన ఛార్టెస్ బాబేజ్ ఆత్మ బాధపడుతుంది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హైడ్రాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment