
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని తల్లి అర్బుదమ్మాల్ ద్వారా తమిళనాడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్, నళినితో పాటు ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నందున విడుదల చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారి విడు దలను నిరాకరించారు. దీంతో నిరాశ చెందిన పేరరివాలన్ తల్లి జోలార్‌పేటలోని తన నివా సంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
రాజీవ్ హత్య కేసులో 19 ఏళ్ల వయస్సులో ఉన్న పేరరివాలన్‌ను విచారణకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారన్నారు. 27 ఏళ్లుగా చట్ట ప్రకారం విడుదల అవుతాడని ఎదురు చూసినా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత సీఎం జయలలిత రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారస్సు చేశారన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. కోర్టు నుంచి మంచి తీర్పు వింటామనే ఆశతో ఉన్న ఏడుగురికి నిరాశ మిగిల్చేలా రాష్ట్రపతి నిరాకరణ తెలపడం బాధాకరమన్నారు. మహాత్మాగాంధీ హత్యకేసు నిందితులకు 14ఏళ్లు మాత్రమే శిక్ష విధించి విడుదల చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేరరివాలన్‌ను 27 ఏళ్లుగా విడుదల చేయకపోవడంపై కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment