
ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ పేరు తీయొద్దు: వీహెచ్
ఉప్పల్ స్టేడియానికి రాజీవ్‌గాంధీ పేరును తొలగించొద్దని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియానికి రాజీవ్‌గాంధీ పేరును తొలగించొద్దని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ పేరును తొలగిస్తే పెద్దఎత్తున ప్రతిఘటిస్తామన్నా రు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్‌గాంధీని అప్రతిష్ట పాలు చేయాలని అప్ప టి ప్రభుత్వాలు ప్రయత్నించినా మచ్చలేని మనిషిగా నిరూపించుకున్నారన్నారు.
ఈ నెల 21న రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలేరులో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. ప్రధాని మోదీ ఆదర్శ విలువలు పాటించాలని, ఆయన తల్లిని గుజరాత్‌కు పంపకుండా తన వద్దే ఉంచుకోవాలని సూచించారు.