కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి.కుంతియా తదితరులు
దూద్‌బౌలి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, నాయకులంతా కలసి కట్టుగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి.కుంతియా అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన స్మారక కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఉగ్రవాదుల నిర్మూలన, శాంతి సామరస్యం కోసం చార్మినార్ సద్భావన యాత్ర ప్రారంభించి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత రాజీవ్‌గాంధీ అన్నారు.విద్యావేత్త ప్రొఫెసర్ డాక్టర్ గోపాలకృష్ణను ఎమ్మెల్సీ కమలాకర్ చేతుల మీదగా రాజీవ్‌గాంధీ స్మారక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్, మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు డి. శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment