rc khuntia
-
బీజేపీతో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వల్ల దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలను ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూల్చివేస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. సొంత పార్టీ సభ్యుల బలం లేకుండానే అధికారపక్ష సభ్యులను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్ ముఖ్యమంత్రికి అసెంబ్లీ సమావేశంలో బలనిరూపణ చేసుకోవడానికి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. వెంటనే రాజస్తాన్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సంఖ్యాబలం నిరూపించుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలని ఆ ప్రకటనలో కుంతియా డిమాండ్‌చేశారు. -
బీజేపీవి చీకటి ఒప్పందాలు
నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్తో, ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎంతో చీకటి ఒప్పందాలు చేసుకుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ఆరోపించారు. ఆదివారం నర్సాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఎంఐఎంతో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ముíస్లిం ఓట్లను ఎంఐఎం పార్టీకి, హిందువుల ఓట్లను బీజేపీ చీల్చుకొని కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తూ.. దీనికి చీకటి ఒప్పందాలే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో బీజేపీకి చెందిన అరెస్సెస్ ర్యాలీకి, ఎంఐఎం బహిరంగ సభకు అనుమతి స్తుందని కానీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స వం రోజు తమ పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటామంటే అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ అంటే వె న్నులో భయం పుట్టుకొస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ అన్నారు. సమావేశం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంఎస్సీ భోస్‌రాజు, టీపీసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పాదయాత్ర వాయిదా: ఆర్సీ కుంతియా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలకు నిరసనగా చేపట్టనున్న పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. ఈనెల 16న గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 8న జరిగిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్‌దే అధికారం
దూద్‌బౌలి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, నాయకులంతా కలసి కట్టుగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి.కుంతియా అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన స్మారక కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఉగ్రవాదుల నిర్మూలన, శాంతి సామరస్యం కోసం చార్మినార్ సద్భావన యాత్ర ప్రారంభించి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత రాజీవ్‌గాంధీ అన్నారు.విద్యావేత్త ప్రొఫెసర్ డాక్టర్ గోపాలకృష్ణను ఎమ్మెల్సీ కమలాకర్ చేతుల మీదగా రాజీవ్‌గాంధీ స్మారక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్, మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు డి. శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
‘రాహుల్ అపాయింట్మెంట్తో రాజుకు ఏం సంబంధం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపుల్లో ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజుకు ప్రమేయం లేదని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. పీసీసీ, ఎల్.ఓ.పి, ఇంచార్జి కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆలోచించే టిక్కెట్లు కేటాయించామని తెలిపారు. వాటితో కొప్పుల రాజుకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. తమకు టికెట్ ఇవ్వకుండా రాజు అడ్డుకున్నారనే కొంతమంది వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. పార్టీ నాయకులెవరైనా తమ ఫిర్యాదులను పీసీసీ, ఏఐసీసీకి దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, పత్రికలకు ఎక్కి ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. కొప్పుల రాజు సిన్సియర్‌గా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనకు తెలంగాణ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజు వల్లనే రాహుల్ గాంధీని కలవలేక పోతున్నామనే కొందరు నేతల ఆరోపణల్ని సైతం కుంతియా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్తో కొప్పులరాజుకు ఏం సబంధమని ప్రశ్నించారు. అది పూర్తిగా రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి చూసుకుంటారని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు పత్రికలకి ఎక్కి ఆరోపణలు చేయకుండా సమస్యలేవైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికపై మాట్లాడాలని సూచించారు. -
‘హుజూర్నగర్’ తర్వాతే?
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదా..? త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు ఉంటాయనే ప్రభుత్వ సంకేతాలు... ఆరు నెలల్లో హుజూర్నగర్ అసెంబ్లీకి అనివార్యంగా జరగాల్సిన ఉప ఎన్నిక నేపథ్యంలో అవి పూర్తయిన తర్వాతే ఉత్తమ్‌ను మారుస్తారా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇప్పటికిప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన పనిలేదని, ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మారిస్తే పార్టీలో సమన్వయానికి కొంత ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తును అధిష్టానం ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే సోమవారం విలేకరులతో మాట్లాడిన కుంతియా ఇప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలా?.. వద్దా?.. అన్నది తేలిన తర్వాతే మార్పులుంటాయని చెప్పడం గమనార్హం. ఎన్నికలకు ముందు ఎందుకు..? రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలు, లోక్‌సభ ఎన్నికల్లో 3 స్థానాలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల్లో 20–25 శాతం స్థానాలు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ దూకుడు మీద ఉండటం, 32 జిల్లా పరిషత్‌ల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కంటితుడుపు విజయమైనా ఆ పార్టీకి అనివార్యం కానుంది. కనీసం జిల్లాకు ఒకటో, రెండో మున్సిపాలిటీల్లోనైనా గెలవకపోతే పట్టణ ప్రాంతాల్లో ఘోరంగా దెబ్బతినే అవకాశముంది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై కసరత్తును కాంగ్రెస్ అప్పుడే ప్రారంభించింది కూడా. ఇక, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ అసెంబ్లీకి ఆరు నెలల్లో ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలుపోటములు కూడా కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ప్రక్రియ జరిగితే సమన్వయం దెబ్బతింటుందని, ఈ రెండు ఎన్నికల తర్వాతే అధ్యక్షుడిని మారిస్తే బాగుంటుందని చాలా మంది నేతలు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం. పెరుగుతున్న జాబితా.. ఇక టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. రేవంత్ రెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విజయశాంతి, దామోదర రాజనర్సింహ, సంపత్ పేర్లు రేసులో వినిపిస్తుండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. నిన్నటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని అడిగిన జగ్గారెడ్డి ఆదివారం కుంతియాను కలసి తనకు కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. దీనికి తోడు అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తెచ్చే మెడిసిన్ తన వద్ద ఉందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటే జూలైలో ఉంటుందని, లేదంటే మరో ఏడాది కూడా ఉత్తమే అధ్యక్షుడిగా ఉంటారనే చర్చ పార్టీలో జరుగుతోంది. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొసాగుతారు: కుంతియా పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతారని ఏఐసీసీ ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుని నియామకంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రాజగోపాల్ రెడ్డికి పార్టీ చాలా గౌరవం ఇచ్చింది. కానీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. అతని మీద క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఎవరు క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదు’అని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని, ఆయన మంచి ఫైటర్ అన్న విషయం మొన్నటి ఎన్నికల్లో తేలిందన్నారు. 29న సాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 29న నాగార్జునసాగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని కుంతియా తెలిపారు. ఈ ఎన్నికల వ్యూహరచన కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి పెంచాలని కుంతియా డిమాండ్ చేశారు. ఇకపై ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో మండల, జిల్లా, బ్లాక్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, జూలై మొదటివారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో భేటీ ఉంటుందన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. -
‘తెలంగాణ డిక్టేటర్ షిప్‌కు కేరాఫ్ అడ్రస్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ డిక్టేటర్ షిప్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ, సీఎల్పీ నేతలు ఫిర్యాదు చేసిన స్పీకర్ పట్టించుకోలేదని తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకేసారి టీఆర్ఎస్లో చేరారనేది అవాస్తమని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇంకో లేఖ ఇచ్చే హక్కు లేదని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ పదవికి అప్రతిష్ట పాలు చేశారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్‌కు రావడానికి భయపడితే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బాన్సువాడకు వెళ్లి పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారని అన్నారు. స్పీకర్‌కు ఇది తగునా అనిప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నైతికత గురించి మాట్లాడుతున్నారని.. అలాగైతే 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం బాధకమరని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ వీలినంపై సోమవారం మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎలా లబ్ది పొందారనే ఆధారాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కేవలం ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి కొనుగోలు చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరిన ఇబ్బంది లేదన్నారు. ఒక దళిత నాయకుడు సీఎల్పీ నేతగా ఉండటం కేసీఆర్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. శనివారం ఇందిరా పార్క్ దగ్గర చేపట్టే నిరహారదీక్షకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
‘మోదీకి మద్దతుగానే కేసీఆర్ వెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, జాతీయ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. అన్ని రాష్ట్రాల పార్టీల నాయకులను కూడా కలుస్తామన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. 38 ఈవీఎంలు పనిచేయలేదని, పోలింగ్ ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు చాలా తేడా వచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తప్పులతో 22 లక్షల ఓట్లు కోల్పోయామని వాపోయారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించారని ఆరోపించారు. మోదీకి మద్దతుగానే సీఎం కేసీఆర్.. ఒడిశా, బెంగాల్ వెళ్లారని ఆరోపించారు. మోదీకి బీ టీమ్‌గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కుంతియా తెలిపారు. ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం తక్కువ ఓట్ల తో ఓడిపోయామని.. దీనిపై న్యాయం పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటి వరకు ఈసీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. గెలిచిన ఎమ్మెల్యేలు రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, దామోదర్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టో విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రజలను ఆకర్శించే హామీలతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 35 అంశాలతో 112 పేజీలతో రూపొందించిన మేనిఫేస్టోలో హామీలను గుమ్మరించింది. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియా, సీనియర్ నేత జైరాం రమేష్, పార్టీ ముఖ్య నాయకులు కలసి మేనిఫేస్టోను విడుదల చేశారు. సుపరిపాలనతో మొదలుకుని రైతులు, యువత, వైద్యరంగాల సంక్షేమంతో పాటు పలు కీలకమైన అంశాలను ప్రధానంగా ప్రణాళికలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిజాం వారసత్వ సంపదగా భావించే ఉస్మానియా ఆసపత్రిని కాపాడుకుంటామని పేర్కొంది. పీపుల్స్ మేనిఫెస్టో ఇది ప్రజల ఆశలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో తయారు చేశామని, ఇది కచ్చితంగా పీపుల్స్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పక్కాగా మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముందుగా ప్రకటించిన పింఛన్, నిరుద్యోగ భృతికి మరో 16 రూపాయలు పెంచి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో జోడించడం హాస్యాస్పదమన్నారు. ప్రతీ ఏడాది ఇంప్రూమెంట్ రిపోర్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ పాలనలో ప్రవేశ పెట్టినవి మంచి పథకాలైతే కొనసాగిస్తామని లేకుంటే తొలగిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పాలసేకరణకు ఐదు రూపాయల ఇన్సెంటీవ్ అందిస్తామని, సీనియర్ సిటిజెన్లకు బస్సు ప్రయాణంలో యాభై శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోపై ప్రతీ ఏడాది ప్రజలకు ఇంప్రూవ్మెంట్ రిపోర్టు అందిస్తామన్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహా రాలేకపోతున్నానని తెలపడంతో ఆయన లేకుండానే విడుదల చేశామని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టోలోని అంశాలు ఉద్యమకారుల కుటుంబానికి 10లక్షల ఆర్థిక సహాయం, సామాజిక గౌరవం మూడు నెలల్లో ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత ఏక కాలంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ పెట్టుబడి సహాయాన్ని కొనసాగించి.. రైతు కూలీలకు వర్తింపచేయటం 17 పంటలకు మద్దతు ధర నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ 20 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ ప్రతీ మండలానికి 30 పడకల ఆసుపత్రి అర్హులైన పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇందిరమ్మ ఇండ్ల బకాయిలు చెల్లింపు ..అదనపు గది కోసం రెండు లక్షలు ఎస్సీల్లో మూడు కార్పొరేషన్ లు ఎస్టీల భూములకు 1970 భూ చట్టాన్ని పటిష్టంగా అమలు ఇమామ్ లకు 6వేల గౌరవేతనం, ట్రెజరీ ద్వారా వక్ఫ్ బోర్డు లకు జ్యూడిషియల్ అధికారాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానం అమలు పీఆర్సీ, ఐఆర్లను అమలు పేదలకు ఉచితంగా ఆరు సిలిండర్లు -
టీఆర్ఎస్ వెలమల పార్టీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని వెలమ సామాజిక వర్గం వ్యక్తులు నడిపిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా విమర్శించారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ బలహీనంగా ఉన్నందునే తమ పార్టీ నేతలను చేర్చుకుంటోందని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నేతల సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెట్టాలని చూస్తున్నారని, అయినా ఉత్తమ్ నాయకత్వంలో టీఆర్ఎస్ను తాము ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న కుంతియా.. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. గద్దె దించేందుకు ప్రజలూ సిద్ధం: ఉత్తమ్ ‘ముందస్తు ఎన్నికలకు సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ రద్దుపై గవర్నర్‌కు లేఖ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా..? ఎవరైనా వద్దన్నారా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ నిరంకుశ పాలనలో అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన ప్రజలు కూడా ఎన్నికలకు, టీఆర్ఎస్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. దానం నాగేందర్ పార్టీని వీడటం బాధాకరమన్న ఉత్తమ్.. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. తప్పుడు సర్వేలతో కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. -
‘ఈటల రాజేందర్ పనైపోయినట్టే’
సాక్షి, హుజురాబాద్: ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పెట్టే ఫ్రంట్ బూటకమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు ఈ సభే సమాధానం చెబుతుందన్నారు. ఈ సభని చూస్తే మంత్రి ఈటల రాజేందర్ పనైపోయినట్టే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే విలాసవంతమైన జీవితం గడుపుతోందన్నారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తున్నందునే మే నెలలో వ్యవసాయ పెట్టుబడి ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని వెల్లడించారు. వ్యవసాయ పెట్టుబడి కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 వేల మంది రైతులు చనిపోతే వారి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతుందని, 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొత్త నాటకం: కుంతియా కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాగుతున్న యాత్ర 4 జిల్లాలు,17 నియోజక వర్గాల్లో విజయవంతం అయిందని కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ది చేకూరిందన్నారు. మోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. మోదీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని బయటికి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కలిసికట్టుగా పని చేస్తామన్నారు. -
శివశంకర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసిన పి. శివశంకర్ కుటుంబాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి కుంతియాలు పరామర్శించారు. బుధవారం రాత్రి జూబ్లీ హిల్స్ లోని మాజీ మంత్రి శివశంకర్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి లక్ష్మిబాయి, కుమారుడు వినయ్ కుమార్ లను దిగ్విజయ్, కుంతియా సహా కొందరు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. దివంగత నేత శివశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి వెంట టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రోటోకాల్ ఇంచార్జి హెచ్ వేణుగోపాల్ ఉన్నారు. -
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
-
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
టీపీసీసీ విస్తృతస్థాయి భేటీలో చర్చ చిన్నారెడ్డి ప్రతిపాదనకు సానుకూల స్పందన ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు 24, 25 తేదీల్లోనే సదస్సు: కుంతియా, పొన్నాల సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉం టుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఒక ప్రతిపాదన వచ్చింది. పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని ప్రతిపాదిం చారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందిం చారు. ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ రాష్ర్ట సదస్సు నిర్వహణపై సమావేశం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ లోపమనే కారణమనే ఆవేశంతో కార్యకర్తలు ఉన్నారని, ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహిస్తే వారి ఆగ్రహం మరిం త రెట్టింపవుతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ సూచించారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున సదస్సు నిర్వహించి తీరాల్సిందేనంటూ డీకే ఆరుణ, నంది ఎల్లయ్య అన్నారు. అధికారంలో ఉన్నప్పు డు కార్యకర్తలను పట్టించుకోలేదని, సదస్సు వేదికగానైనా వారి ఆవేదనను పంచుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సమావే శం అనంతరం కుంతియా, పొన్నాల మాట్లాడుతూ హైకమాండ్ మాత్రం ఈ నెల 24, 25 తేదీల్లో సదస్సు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కార్యాచరణను రూపొందిస్తామని తెలి పారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, సీనియర్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ సహా పలువురు సీనియర్ నాయకులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సోదరుడు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ రావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.