
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలకు నిరసనగా చేపట్టనున్న పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. ఈనెల 16న గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 8న జరిగిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment