
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వల్ల దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలను ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూల్చివేస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. సొంత పార్టీ సభ్యుల బలం లేకుండానే అధికారపక్ష సభ్యులను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్ ముఖ్యమంత్రికి అసెంబ్లీ సమావేశంలో బలనిరూపణ చేసుకోవడానికి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. వెంటనే రాజస్తాన్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సంఖ్యాబలం నిరూపించుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలని ఆ ప్రకటనలో కుంతియా డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment