
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయల్దేరిన కవిత ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. సీబీఐ విచారణపై కేసీఆర్‌కు వివరించారు. 45 నిమిషాలపాటు వీరి సమావేశం కొనసాగింది. అనంతరం ప్రగతిభవన్ నుంచి కవిత తన ఇంటికి వెళ్లారు.
కాగా ఢిల్లీ లిక్కరర్ స్కాం కేసులో కవితను సీబీఐ ఆదివారం విచారించిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్‌పీసీ 161కింద కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ ముగియడంతో సీబీఐ అధికారులు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు కవిత విచారణకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
చదవండి: ముగిసిన కవిత సీబీఐ విచారణ..